దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

ఆ ప్రేమను కనుపరచగ భువికి వచ్చెను (2)

 

అ.ప.: లోకాన్ని రక్షింప ప్రేమ రూపుదాల్చెను

ప్రేమ స్వరూపునిగ యేసు అవతరించెను (2) ..దేవుడు

 

1. లోకపాపములు మోయు గొర్రెపిల్లగ

పాపము నుండి లోకమును వేరుచేయగ

పాప జీత మరణ భయము కూల్చివేయగా

పరమ సుతుడు యేసు ఘోర శ్రమలు పొందగ

లోకము నీడలో బ్రతకాలని-నూతన సంఘముగ మారాలని

ప్రేమలో నిత్యం ఒదగాలని-సత్యవాక్య నీడలో ఎదగాలని ..లోకాన్ని

 

2. పరిశుద్ధుని యేసు రక్త సంబంధము

కలువరిపై యేసుని త్యాగ ఫలం

పరలోక పరమతండ్రి సంతోషము

క్రీస్తు పునరుత్థాన బలమే ఈ సంఘము

యేసు ప్రేమకు ప్రతిరూపము-ధరణిలో సంఘమే ప్రత్యేకము

ఎత్తబడే సంఘం ప్రభు సంకల్పము

 

నిత్య రాజ్యమునకును దైవఫలం ..లోకాన్ని