దేవా యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్దాలయ పరమ నివాస

దేవా యెహోవా స్తుతి పాత్రుండా పరిశుద్దాలయ పరమ నివాస

1.బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే

సకల ప్రాణులు స్తుతి చెల్లించగ

సర్వద నిను స్తుతులొనరించగనున్నా

2.నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే

నీదు ప్రభావ మహాత్యములన్నియు

నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే

3.పరమాకాశపు దూతలు సేనలు పొగడగ మీరు

ప్రేమామయుని స్తోత్రము చేయగ

పరమానందుని వేగ స్మరించుచు రారె

4.సకల జలచర సర్వసమూహములారా

ఓ ప్రజాలారా భూపతులారా

 

మహానీయుండగు దేవుని స్తుతి చేయన్