దేవా మా కుటుంబము నీ సేవకే అంకితం

దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము (2)

ఈ శాప లోకాన నీ సాక్షులుగా నిలువ

నీ ఆత్మతో నింపుమా (2)           ||దేవా||

 

కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు

మాకేమి భయము మాకేమి దిగులు

నీకే వందనములయ్యా

లోబడి జీవింతుము లోపంబులు సవరించుము

లోకాశలు వీడి లోకంబులోన

నీ మందగా ఉందుము          ||దేవా||

 

సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము

నెమ్మది గల ఇల్లు నిమ్మళమగు మనస్సు

ఇమ్మహిలో మాకిమ్మయ్యా

ఇమ్ముగ దయచేయుము గిన్నె నిండిన అనుభవము

ఎన్నో కుటుంబాల ధన్యులుగా జేయంగా

మమ్ములను బలపరచుము         ||దేవా||

 

ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను

లోక దురు వ్యసనంలా తాకుడు లేకుండా

దాచుము నీ చేతులలో

ఒలీవ మొక్కల వలెను ద్రాక్షా తీగెలను పోలి

ఫల సంపదలతోను కలకాలము జీవించ

కురుపించుము నీ దీవెనలన్         ||దేవా||

 

పెంపారు జేయుము మాలో సొంపుగ నీ ఘన ప్రేమన్

నింపుమా హృదయములు శాంతి భాగ్యంబులతో

సంతసంబుగ సాగెదము

వింతైన నీ ప్రేమను అంతట ప్రకటింతుము

కొంత కాలమే మేము ఉందుము లోకాన

చెంత చేరగ కోరెదము

 

నీ చెంత చేరగ కోరెదము            ||దేవా||