దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా

దేవా మహోన్నతుడా

మహిమా ప్రకాశితుడా (2)

పదివేలలో అతి సుందరుడా

కీర్తింతు మనసారా (2)         ||దేవా||

 

వెలిసావు భువిలో మెస్సయ్యగా

ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2)

నిస్సారమైన నా జీవితములో

చిగురించె ఆనందము (2)          ||దేవా||

 

లేచాను ఒంటరి విశ్వాసినై

వెదికాను నీ దారి అన్వేషినై (2)

నీ దివ్య మార్గము దర్శించినా

 

ఫలియించె నా జన్మము (2)        ||దేవా||