దేవా నీ ప్రేమను ప్రకటింతును నా జీవితాంతము
దేవా నీ కరుణను చాటింతును నా ఊపిరి ఉన్నంత వరకు (2)
దూరమైన -భారమైన -కష్టమైన -నష్టమైన (2)
సాగెదన్ ఆగక- పరుగెత్తెదన్ వెనుదిరుగక (2)
1.నీ ప్రేమ నుండి యెడబాపువాడెవరూ- నీ కరుణ నుండి విడదీయలేరెవ్వరుా (2)
నీ సిలువ ప్రేమను లోకానికి నేను చాటెదను
అంతము వరకు శ్రమలను సహించెదన్ (2) “దేవా”
2.నశించు ఆత్మలకై ప్రార్ధన నే చేతును – సత్యముకై పోరాడే సాక్షిగా నేనుందును (2)
సువార్త కాడిని సంతోషముగా నేను మెాయుదును
క్రీస్తు కొరకై సజీవ సాక్షిగా నేనుందును (2) “దేవా”