దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ

దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ

నాయెడల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది

 

1.స్తుతు లర్పింతు ప్రభు నీకు నేడే -స్తుతి పాడేద హృదయముతో |దేవా|

స్తుతించి వర్ణించి ఘనపరతున్-నీవే నా రక్షకుడవని|దేవా|

 

2.మొదట నిన్ను ఎరుగనైతిని-మొదటే నన్ను యెరిగితివి

వెదుకాలేదు ప్రభువా నేను-వెదికితివి యీ పాపిని |దేవా|

 

3. మరణమగు ఊబిలో నుంటిని-కరుణ నిలచె నన్ను రక్షింప      

మరణము నుండి  రక్షింపనన్ నా ప్రభు బలియాయెను |దేవా|

 

4.పాపలోకములో మునిగి యుంటిని -పాప శిక్షకు పాత్రుడను    

యేసు ప్రభు సిలువ సహించెను నాకు నూతన జీవమొసగ|దేవా|

 

5.అద్భుతమైనది సిలువ దృశ్యం -ప్రభువును కొట్టి ఉమ్మివేసిరి    

ప్రభుని వర్ణింపనశక్యము ప్రభువే సహించె దుఃఖము|దేవా|

 

6.ఎట్లు మౌనముగా నుందు ప్రభూ -చెల్లింపక స్తోత్ర గీతము

 

కాలమంతా పాడుచుండెద -నీ ప్రేమ అపారమైనది|దేవా|