దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం

దేవా నీ గొప్పకార్యములన్ మదిన్ తలచి స్తుతించెదం

నీ ఆశ్చర్యక్రియలను పాడి కీర్తించెదం

హల్లెలూయా నా యేసురాజ

హల్లెలూయా నా ప్రాణనాథ (2)

స్తుతులు మహిమ ఘనత నీకే (2)      ||దేవా నీ||

 

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి

పరమును వీడి భువికరుదెంచి

కలువరి సిలువలో రక్తము కార్చి

నీదు కృపతో నను రక్షించిన

నీ దివ్య ప్రేమను అత్యధికముగా

స్మరింతున్ జీవిత కాలమంతా          ||దేవా నీ||

 

నీ కంటిపాపగా నన్ను కాచి

నీ చేతి నీడలో నన్ను దాచి

నీ అరచేతిలో నను చెక్కుకొని

నీదు సొత్తుగా నను చేసుకొని

అక్షయమైన నీ మధుర ప్రేమను

 

దీక్షతో ఇలలో చాటెదను                 ||దేవా నీ||