దేవా! నీ కృప నిరంతరం

దేవా! నీ కృప నిరంతరం – మారనిదెపుడు నా ప్రభువా నిత్యజీవము గలది ప్రియ ప్రభువా ….. దేవా! నీ కృప నిరంతరం1.

పాపినగు నన్ను ఓ ప్రభువా – పరిశుద్ధపరచెను నీ కృపయే –2    

పరమ స్వాస్థ్యము నొందుటకు – ప్రేమతో నన్ను పిలిచితివే –2   

 

2. రక్షణ భాగ్యము పొందుటకు – రక్షక యేసు నీ కృపయే –2   

నిత్యము నీతో నుండుటకు – నిత్య జీవము నిచ్చితివే –2  

 

3. విశ్వాస జీవితం చేయుటకు – విజయము నిచ్చెను నీ కృపయే –2

శోధన బాధలు అన్నిటిలో – శక్తినొసంగి నడిపితివే –2

 

4. కృపలో నడుపుము ఓ దేవా – కృపతో నింపుము నా ప్రభువా –

 

నిత్యము కృపలో నన్ను నడిపి – నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము –2