దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం

దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం ॥2

కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్ ॥2॥ ॥దేవా॥

1నావ ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను

జీవితములో నీవుండగా ఎవరిని గూర్చీ పాడెదను

శతకోటి పాటలు  నిను గూర్చి

పాడిన నా ఆశ ఎన్నటికీ తీరదయా ॥2

కడవరకు నిన్ను కీర్తించీ పొగడెద నా

నా..నాధుడా నా జీవా..నాధుడా ॥దేవా॥

2దేహమంత కృషియించినా వాడి నశియించి పోయినా

రక్త ధారలై ప్రవహించినా మరణమాసన్న మైనను

క్షణమైన నిన్ను  స్తుతియింప మరచినా      

జీవిత పయనం వ్యర్ధమయ్యా ॥2

జీవమిచ్చిన నిన్ను కీర్తించీ పొగడెద నా

 

నా..నాధుడా  నా జీవా..నాధుడా ॥దేవా॥