దేవా నా యందు-ఎంతో ప్రేమ-నీ దివ్య ప్రేమ నాలో -ఉప్పొంగెను హల్లెలూయా

దేవా నా యందు-ఎంతో ప్రేమ-నీ దివ్య ప్రేమ నాలో -ఉప్పొంగెను హల్లెలూయా…..2

1.      దినదినము నీదు ప్రేమ-రుచి చూచుచున్నాను

దయ గల జీవహారం తో- పోషించుచున్నావు

దేవా !నీ జీవ జలము -నాకిచ్చితివే -నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||

2.      నా పాదములను నీవు -బండపై నిలిపితివి

నా అడుగుల నెల్ల -స్థిరపరిచిన దేవుడవు

దేవా!నా కాశ్రయుడవు- నీవే కదా -నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||

3.      సిలువలో రక్తము కార్చి-నను రక్షించితివి

సార్వత్రిక సంఘములోన -నన్నైక్యపరచితివి

దేవా!నీ దయ నా యెడల అత్యున్నతం-నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||

4.      వాగ్దానములు నాలో- నెరవేర్చిన ఓ ప్రభువా

విడువక నా యెడల నీదు- కృప చూపుచున్నావు

దేవా మారని నీ ప్రేమ- సంపూర్ణము-నీ దివ్య ప్రేమ నాలో. ఉప్పొంగెను||హల్లె||

5.      మృతిని గెల్చి మా కొరకై -తిరిగి లేచిన ప్రభువా

మా కొరకై త్వరలో రానై – యున్న మహిమ రాజా

 

దేవా!నీ సన్నిధి నాకు -ఎంతో ప్రియము-నీ దివ్య ప్రేమ నాలో  ఉప్పొంగెను||హల్లె||