దేవా నా దేవుడవు నీవే

దేవా నా దేవుడవు నీవే 

వేకువనే నిన్ను వెదకుదును –2

నీ బలమును – ప్రభావమును చూడ

నేనెంతో ఆశతో ఉన్నాను 

దేవా నా దేవుడవు నీవే  వేకువనే నిన్ను వెదకుదును

 

1.నీరు లేని దేశమందు – దప్పిగొన్నది నా ప్రాణం  -2

నీ మీద ఆశచేత – సొమ్మసిల్లెను నా శరీరం –2

దేవా నా దేవుడవు నీవే

వేకువనే నిన్ను వెదకుదును

 

2. ఉత్సహించు పెదవులతో – నా నోరు చేసేను గానం –2

నీ రెక్కల చాటునా – శరణన్నది నా ప్రాణం –2

దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును –2

నీ బలమును – ప్రభావమును చూడ

నేనెంతో ఆశతో ఉన్నాను

దేవా నా దేవుడవు నీవే  వేకువనే నిన్ను వెదకుదును