దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై

దేవర నీ దీవెనలు

ధారాళముగను వీరలపై

బాగుగ వేగమే దిగనిమ్ము

పావన యేసుని ద్వారగను (2)

 

దంపతులు దండిగ నీ

ధాత్రిలో వెలయుచు సంపదలన్

సొంపుగ నింపుగ పెంపగుచు

సహింపున వీరు సుఖించుటకై       ||దేవర నీ||

 

ఈ కవను నీ కరుణన్

ఆకరు వరకును లోకములో

శోకము లేకయే ఏకముగా

బ్రాకటముగను జేకొనుము            ||దేవర నీ||

 

ఇప్పగిది నెప్పుడును

గొప్పగు ప్రేమతో నొప్పుచు దా

మొప్పిన చొప్పున దప్పకను

మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్      ||దేవర నీ||

 

తాపములు పాపములు

మోపుగ వీరిపై రాకుండగా

గాపుగ బ్రాపుగ దాపునుండి

యాపదలన్నియు బాపుచును        ||దేవర నీ||

 

సాధులుగన్ జేయుటకై

శోధనలచే నీవు శోధింపగా

కదలక వదలక ముదమున నీ

పాదము దాపున బాదుకొనన్          ||దేవర నీ||

 

మెండుగ భూమండలపు

గండములలో వీరుండగను

తండ్రిగ దండిగ నండనుండి

వెండియు వానిని ఖండించావే         ||దేవర నీ||

 

యిద్దరు వీరిద్దరును

శుద్ధులై నిన్ను సేవించుటకై

శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్

దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్        ||దేవర నీ||

 

వాసిగ నీ దాసులము

చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని

మా సకలేశ్వర నీ సుతుడ

 

యేసుని పేరిట బ్రోవుమామేన్        ||దేవర నీ||