దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే

దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే

అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే (2)

స్మరియించు రక్షకుని అనుకూల సమయమున

చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       ||దుర్దినములు||

 

సాగిపోయిన నీడవంటి జీవితం

అల్పమైనది నీటి బుడగ వంటిది (2)

తెరచి ఉంది తీర్పు ద్వారం

మార్పులేని వారికోసం (2)

పాతాళ వేదనలు తప్పించుకొనలేవు

ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       ||దుర్దినములు||

 

రత్నరాసులేవి నీతో కూడ రావు

మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)

యేసు క్రీస్తు ప్రభువు నందే

ఉంది నీకు రక్షణ (2)

తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని

 

విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       ||దుర్దినములు||