దారి తప్పి పోతున్నావా విశ్వాసి

దారి తప్పి పోతున్నావా విశ్వాసి
తీరమేదో గమనించావా విశ్వాసి (2)

ఈ లోకం ముళ్ళ బాట
విశ్రాంతి లేని చోట (2)
యేసయ్యే జీవపు బాట
సాగిపో ఆయన వెంట (2)
యేసుతో నీవొస్తావా విశ్వాసి
లోకం విడిచి రానంటావా విశ్వాసి (2)        ||దారి||

ఓడలోని నల్ల కాకి
చూడ నేర్చే ఈ లోకాన్ని (2)
చూడ చూడ లోకపు రుచి
ఓడ మరచిపోయే కాకి (2)
కాకిలా నీవుంటావా విశ్వాసి
పావురంలా తిరిగొస్తావా విశ్వాసి (2)       ||దారి||

 

ఓడలోనున్ననాడు
యేసు నీకు తోడుంటాడు (2)
ఆశ్రయంబుగా ఉంటాడు
ఆశలన్నీ తీరుస్తాడు (2)
యేసులో నీవుంటావా విశ్వాసి
సంఘమందు చేరుంటావా విశ్వాసి (2)      ||దారి||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *