దయగలిగిన సామీ ఓ యేసయ్యా

దయగలిగిన సామీ ఓ యేసయ్యా

బయబక్తితో నిన్ను కొలిసేమయ్యా

మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా

మనసుల్లో నీ రూపం నిలిపేమయ్యా

నీకెరుకలేంది ఏమున్నది మాలోపల

నీ కనికరం లేకపోతే బతికేదెలా

 

1. నేలమన్ను తీసి – నరునిగా చేసి

నీ జీవం పోసావయ్యా – జీవాత్మగ మార్చావయ్యా

నీ ఊపిరి సృష్టి అందము – మా కాపరీ నీవే నిత్యజీవము

 

2. ఆజ్ఞ ఇయ్యగానే – నోటి మాటతోనే

సృష్టంత కలిగేనయ్యా – అందంగా వెలిగేనయ్యా

నీ ఊపిరి సృష్టి అందము – మా కాపరీ నీవే నిత్యజీవము

 

3. ప్రాణమునే నీవు ధారపోసినావు

మరణాన్నే గెలిచావయ్యా – సాతానుని కూల్చావయ్యా

నీ ఊపిరి సృష్టి అందము – మా కాపరీ నీవే నిత్యజీవము