దండలు దాండలయ్యా సామి నిండ మా దండలయ్యా

దండలు దాండలయ్యా సామి నిండ మా దండలయ్యా

మెండుగ దీవించి మా బతుకు పండించి

అండగ ఉండవయ్యా నీవుండగ లోటేదయ్యా

మా కొండవు నీవేనయ్యా

 

1.పేదయింట పుట్టినావా – బీదలైన మమ్ము బ్రోవ

కష్టాలెన్నో ఓర్చినావా – మాదు నష్టాలు తీర్చిదేవ

నీవు లేక నిముషమైన బతకలేము

నీదు సెలవు లేక అడుగు కదపలేము

 

2. చెదరిన గొర్రెల వెదకే – కరుణామయుడవయ్య దేవ

మది నిండ నీ రూపు నిలిపి – నీ శరణు కోరితిమయ్య దేవ

3. పుట్టించి మమ్ముల పెంచే – సృషిసకర్తవు నీవు దేవ

 

విడువమయ్య నీ త్రోవ – నీవే నడిపించవయ్య మా నావ