త్రోవలో నీవుంటివో – త్రోవప్రక్క పడియుటింవో

త్రోవలో నీవుంటివో – త్రోవప్రక్క పడియుటింవో

త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటింవో

అ.ప. : జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో

జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో

 

1. చెరిపివేసుకున్నావు నీదు మార్గమును

చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును

పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే

చీటికి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుటింవే

 

2. సిద్ధపరచెను యేసు నూతన మార్గమును

బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును

సత్యమైన ఆ మార్గంలో జీవం క్షేమం ఉందిలే

నిత్యుడు ఆ దేవునిచేరే ధైర్యం కలిగించిందిలే

 

3. నడచి వెళ్ళుచున్నావా అరణ్యమార్గమున

గమ్యమెరుగకున్నావా జీవనగమనమున

పర్వతములు త్రోవగ చేసి నీటియొద్దకు చేర్చులే

 

త్రోవలను తిన్నగ చేసి ఆత్మదాహమును తీర్చులే