త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే

త్రాహిమాం క్రీస్తు నాథ దయ జూడ రావే

నేను దేహి యనుచు నీ పాదములే

దిక్కుగా జేరితి నిపుడు          ||త్రాహిమాం||

 

గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై

రవ్వ పాలై నేనెంతో నెవ్వ బొందితి

త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాప రాశి

యివ్విధమున జెడిపోతిని నే నేమి సేతు నోహోహోహో          ||త్రాహిమాం||

 

నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తము బూని

చేయరాని దుష్కర్మములు చేసినాడను

దయ్యాల రాజు చేతిలో జేయి వేసి వాని పనుల

జేయ సాగి నే నిబ్భంగి జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో          ||త్రాహిమాం||

 

నిబ్బర మొక్కించుకైన నిజము రవ్వంతైన లేక

దబ్బర లాడుతకు ము త్తా నైతిని

అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు

దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా          ||త్రాహిమాం||

 

నిన్ను జేరి సాటిలేని నిత్యానంద మంద బోవు

చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా

విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి

యన్నిట రక్షించితివి నా యన్న నీకు స్తోత్ర మహాహా          ||త్రాహిమాం||