తోడు లేరని కుమిలిపోకు

తోడు లేరని కుమిలిపోకు

యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)

ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

 

ఆదరణ లేక అల్లాడిపోకు

శోధన వేదనలో కృంగిపోకు (2)

ఆదరించే వాడే యేసు

అల్లాడిపోకు ఓ సోదరా (2) |      |ఓహో సోదరా||

 

విడువడు యేసు ఎడబాయడెన్నడు

అనుక్షణము నిన్ను కాపాడును (2)

ఆయన మీదనే భారము మోపు

 

ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2)         ||ఓహో సోదరా||