తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుదాత్మ వాన

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన

పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2)

అది నూతన పరచును ఫలియింపచేయును

సమృద్ధినిచ్చును సంతోషపరచును (2)        ||తొలకరి||

 

ఎడారి వంటి బ్రతుకును సారముగా చేయును

జీవజలముతో నింపి జీవింపచేయును (2)

ఆకు వాడక ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును (2)            ||అది నూతన||

 

సత్యస్వరూపి శుద్ధాత్మా నీలో వసియించును

పాప బ్రతుకు తొలగించి నూతన జీవితమిచ్చును (2)

యేసుకొరకు నిజ సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును (2)