తేనెకన్న తీయనైనది

తేనెకన్న తీయనైనది

నా యేసు ప్రేమ మల్లెకన్న తెల్లనైనది (2)

నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను

కష్టకాలమందు నాకు తోడైయుండెను (2)     ||తేనెకన్న||

 

ఆగకనే సాగిపోదును

నా ప్రభువు చూపించు బాటలో (2)

అడ్డంకులన్ని నన్ను చుట్టినా

నా దేవుని నే విడువకుందును (2)           ||తేనెకన్న||

 

నా వాళ్ళే నన్ను విడిచినా

నా బంధువులే దూరమైనా (2)

ఏ తోడు లేక ఒంటరినైననూ

 

నా తోడు క్రీస్తని ఆనందింతును (2)           ||తేనెకన్న||