తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే

తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే

నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా –2

తేజోవాసుల స్వాస్థ్యమందు  ……

 1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము –2

శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా –2   తేజో ॥

 2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం –2

కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా –తేజో ॥

 3. శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము –2

శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా –తేజో ॥

 4. నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం –2

 

    అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా –2      తేజో॥