తేజోమయా యేసయ్యా – స్తుతి పాత్రుడవు నీవయ్యా

తేజోమయా యేసయ్యా – స్తుతి పాత్రుడవు నీవయ్యా

అ.ప. : మహిమ ఘనత ప్రభావములు సమస్తము నీకేనయా

 

1. నిజమైన దేవా నీవంటివాడు లేడు

మహాత్మ్యము గల నిన్ను పోలినవాడెవడు

నీ నామము ఘనమైనదయా – నరులు నీకు భయపడెదరయా

 

2. జనములకు రాజా జీవముగలిగిన నాథా

సమస్తము నిర్మించినవాడవు నీవెగదా

 

నీ ఉగ్రత తాళలేమయా – మేలు చేయగలవు నీవయా