తృప్తి పరచి నడిపించును-అక్కరలు సంధించును

తృప్తి పరచి నడిపించును-అక్కరలు సంధించును

మిగిలినవి పొగుచేయును-పరులకు పంచిపెట్టును

పాడి కొనియాడెదన్(మ్)-కోటి స్తుతి చెల్లింతున్(మ్)

1. అయిదు రొట్టెలను-వేవేల పెరుగ చేసెను

అయిదు వేల పురుషులకు-తృప్తిగా వడ్డించెను

2.వెండి బంగారుతో-బయలు దేర  చేసెను

బలహీనం లేకుండనే-కాపాడి నడిపించెను

3.పూరేళ్లను రప్పించి-మన్నాతో పోషించెను

బండను చీల్చగా-నీళ్ళను రప్పించెను

4.గంభీర శబ్దముతో-ఆర్భాట నాదముతో

ఎన్నుకొన్న ప్రజలను-అనుదినం నడిపించెను

5.దీర్ఘాయువు నిచ్చి-అనుదినం నడిపించును

 

ముసలితన మందు- చిగురించు చుందురు.