తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా – ఓ మరియమ్మా

తూర్పు దిక్కు చుక్క బుట్టె

మేరమ్మా ఓ మరియమ్మా (2)

చుక్కను జూచి మేము వచ్చినాము

మొక్కి పోవుటకు (2)             ||తూర్పు దిక్కు||

 

బెత్లెహేము పురము లోని బాలుడమ్మా

గొప్ప బాలుడమ్మా (2)

మన పాపముల బాప పుట్టెనమ్మా

మహిమవంతుడమ్మా (2)        ||తూర్పు దిక్కు||

 

పశువుల పాకలోని బాలుడమ్మా

పాపరహితుడమ్మా (2)

పాపంబు బాపను పుట్టెనమ్మా

సత్యవంతుడమ్మా (2)             ||తూర్పు దిక్కు||

 

బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము

బాల యేసు నొద్దకు (2)

బంగారు పాదముల మ్రొక్కెదము

 

బహుగ పాడెదము (2)            ||తూర్పు దిక్కు||