తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ

తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ

చిలిపి ఊసుల సింధురాలు కలబోసిన శుభవేళ

అనురాగంతో ఒకటవ్వాలని

అనుకున్నవన్నీ నిజమవ్వాలని

 

అ.ప. : ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం

దీవిస్తూ శుభముగ మీ పరిణయం

 

1. ఇన్నినాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది

చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది

కలకాలం మీరు కలిసి ఉండలని

చిరజీవం మీపై నిలిచి ఉండలని

 

2. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది

ఇరు హృదయాల సుందరస్వప్నం నిజముగ మారింది

అరమరికలు లేక ఒకి కావాలని

పరలోక తండ్రికి మహిమ తేవాలని