తిరిగిరాని లోకానికి తరలిపోయే ప్రయాణం.

తిరిగిరాని లోకానికి తరలిపోయే ప్రయాణం.

ప్రతి మనిషి జీవితంలో తప్పదులే మరణం(2)

నీ జననం – నీ మరణం ఒంటరితనమే

నీ బ్రతుకు ముగిసిపోవుటకు చాలును ఒక క్షణమే(2)(తిరిగి)

1.నీ రాక కొరకు ఎదురు చూచె నీవారు..

నీవు చనిపోతే ఎవరు నీతో రారు(2)

ఒక జత బట్టలతో ఒక అత్తరు సీసాతో(2)

సాగనంపు నావైపు వెళ్ళిరండి శ్రీ వారని(2)

బ్రతికుంటే కావాలి చస్తే నువు పోవాలి(2)(తిరిగి)

2. నీ రాక కొరకు ఎదురుచూచె నీ దేవుడు

తనువును చాలించి తనయునిగా వస్తావని(2)

తన సుతుని పంపించి సువార్తను వినిపించి(2)

తండ్రి నీ కోసం తల్లడిల్లిపోతుంటే(2)

 

ఈ సత్యం గమనించు ఇకనైనా కళ్ళు తెరువుము(2)(తిరిగి)