తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే – తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా

తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే

తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా-2

 

1.వేదన లేదు శోధనలేదు – నీ హస్తము విడువనయ్యా – 2

భయమన్నది లేనే లేదు – ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి

 

2. నీ ఉపకారం స్మరియించి – స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను

చేయివిడువని నా యేసయ్యా – కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా.

 

3. మంచికాపరి జీవకాపరి – హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా

ఆహారమై వచ్చితివా – ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా

 

4. నిన్ను నేను పట్టుకొంటిని – భుజముపైన సోలెదను నీ భుజముపైన

సోలెదను.నీ రెక్కల నీడలోనుండి – లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని

 

5. రేయింపవలు వెతికానయ్యా – నీకై వేచితిని నే నీకై వేచితినినా

 

జీవితకాలమంతా – నీ నామం చాటెదను నే నీనామం చాటెదను