తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)

ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును

చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా          ||తల్లిలా||

 

తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను

చూడుము నా అరచేతులలో

నిన్ను చెక్కియున్నాను (2)

నీ పాదము తొట్రిల్లనీయను నేను

నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు

అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||

 

పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ

వీడిపోదు నా కృప నీకు

నా నిబంధనా తొలగదు (2)

దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద

నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద

 

అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య            ||తల్లిలా||