తలచుకుంటే చాలును ప్రభువా నీ సిలువ త్యాగము…

తలచుకుంటే చాలును ప్రభువా నీ సిలువ త్యాగము…

హృదయములో రాలును దేవా కృతజ్ఞతా కన్నీళ్లు… నా

 

1.అన్యాయపు తీర్పు నావు పొందినా

అవహేళన ఓర్పుగా భరియించినా

వధకు తేబడు నీవు గోరియాపిల్లగా

మౌనిగా… దోషిగా… సాగిన ఆ క్షణాన్ని…

 

2.ముళ్ల మకుటము తలకు గ్రుచ్చినా

ఎర్రని అంగీ మొలకు చుట్టినా

ఉమ్మివేసినా… మిమ్ము దూషించినా

తీర్పుతో… ఓర్పుతో… సాగిన ఆ క్షణాన్ని…

 

3.పలుగారే నీదు దేహముపైనా

పాపాత్ముల పాపపు కొరడాలెన్నో(కొరడాలున్నా)

నాట్యమాడినాయి మిమ్ము నడిపించినాయి

భారమై.. ఘోరమై కనుముసిన క్షణాన్ని.

 

నీవు మండాలి ఓ జ్వాలగా..నీవు చేరాలి ఓ గమ్యము.. ॥తలవంచకు॥