తరాలు మారినా మారనే మారదు

తరాలు మారినా మారనే మారదు

ఎన్ని యుగాలైనా విడువదు ఎడబాయదు (2)

 

ఏ ఫలమును ఆశించని ప్రేమ ఏ బలమును కోరని ప్రేమ

ఏ భేదము చూపని ప్రేమ అది వర్ణనకందని ప్రేమ

తనపై నను మోసే ప్రేమ అనుదినము కాచే ప్రేమ

నను మోక్షం చేర్చే ప్రేమ ఆ యేసుని కల్వరి ప్రేమ         ||తరాలు||

 

దుష్టులతో సాంగత్యం చెడు సావాసముతో తిరుగుచుండగా

పిలిచావయ్యా నీ ప్రేమగల పిలుపుతో

ఈర్ష్యాసూయలతో కోపద్వేషాలతో నలిగియుండగా

మలిచావయ్యా నీ దయగల హస్తముతో (2)

ఘోరపాపినైన నన్ను చేర్చుకున్న ప్రేమ

వేషధారినైన నన్ను మార్చుకున్న ప్రేమ

ఆ కలువరిసిలువలో నాకై శ్రమలనోర్చుకున్న ప్రేమ

ఏ క్రమమూ లేని నన్న-మర్చుకున్న ప్రేమ

 

నను ఎన్నడూ విడనాడని

ఎడబాయని శాశ్వతమైన ప్రేమ        ||తరాలు||

 

నీ ప్రేమను రుచి చూచి నీ సన్నిధినే విడచి

ఇహలోకపు ఆశలతో నే కుక్కవలె తిరిగాను

నీ వాక్యపు వెలుగును ఎంచి నీ మార్గాన్నే మరచి

ఈ పాపపు పంకములో నే పందివలె పొర్లాను (2)

నిను విడచీ నే మరచిననూ నను వెదకిన ప్రేమ

నా కన్నా నన్ను ప్రేమించే నీ కృపగల ప్రేమ

నా పాప శాప జీవితం నాకు చూపిన ప్రేమ

 

అది తెలసి తిరిగిరాగా మళ్లీ చేర్చుకున్న ప్రేమ       ||నను ఎన్నడూ||