తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా

తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే యను శక్తి నీయుమీ      ||తనువు||

ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త వినయ పాదము లివిగో      ||తనువు||

స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ
పరిశుద్ధ వార్తతో పరి పూర్ణముగా నింపు      ||తనువు||

వెండి పసిడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున
మెండుగా వాడ పరి మితియవు జ్ఞానం బిదిగో      ||తనువు||

నా యిష్ట మిదిగో యిది నీ యిషముగ జేయ నా యిష్ట మిక గాదది
నా యిఛ్చ యున్నట్టి నా హృదయ మిదిగో నీ
కే యియ్యది రాజ కీయ సింహాసనామౌ      ||తనువు||

 

ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నడు ధార వోయన్
నన్ను నీ వానిగ నాథా గైకొను మెపుడు
చెన్నుగ నీ వశమై స్థిర ముగ నుండెద      ||తనువు||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *