తంబుర సితార నాదముతో క్రీస్తు వేడగ రారండి

తంబుర సితార నాదముతో

క్రీస్తును వేడగ రారండి

ఇద్దరు ముగ్గురు కూడిన చోట

ఉంటాననిన స్వామికే (2)        ||తంబుర||

 

పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని

పాపుల పంక్తిని కూర్చొని (2)

విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిధికే      ||తంబుర||

 

ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లి

నీ శోధనలను సమిధలుగా (2)

 

నరకాగ్నులలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడవా        ||తంబుర||