తండ్రిచెంత చేరే దారి యేసన్నా

తండ్రిచెంత చేరే దారి యేసన్నా

యేసుగాక వేరే దిక్కు లేదన్నా

అ.ప. : శరణం వేడన్నా – స్తోత్రం పాడన్నా

1. పాపివైన నిన్ను ప్రేమించె పరలోకమహిమ త్యజించె

బలియాయె నీ కోసం తండ్రిప్రేమ తెలుసుకో

అర్పించె తన ప్రాణం మనసులోన నిలుపుకో

2. సత్యమైన దారిని విడిచి నిత్యుడైన తండ్రిని మరచి

ఎందాక నీ పయనం వెనుదిరిగి చూసుకో

నీ కొరకు వేచియున్న తండ్రివైపు మరలుకో

3. శాశ్వతం కాదు ఈ లోకం నీటిబుడగ నీదు జీవితం

సరియైన దారిలో నీ బ్రతుకు నిలుపుకో

 

గురివైపు నీ పయనం సాగించ నేర్చుకో