జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా

స్తుతి మహిమలు నీకే

నా ఆత్మలో అనుక్షణం

నా అతిశయము నీవే నా ఆనందము నీవే

నా ఆరాధనా నీవే (2)           ||జ్యోతి||

 

నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా (2)

నీ తోటలోని ద్రాక్షావల్లితో

నను అంటు కట్టి స్థిరపరచావా (2)           ||జ్యోతి||

 

నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి (2)

నీకిష్టమైన పాత్రను చేయ

నను విసిరేయక సారెపై ఉంచావా (2)           ||జ్యోతి||

 

నా తండ్రి కుమారా పరిశుద్దాత్ముడా (2)

త్రియేక దేవా ఆదిసంభూతుడా

 

నిను నేనేమని ఆరాధించెద (2)           ||జ్యోతి||