జుంటి తేనె ధారల కన్నా – యేసు నామమే మధురం

జుంటి తేనె ధారల కన్నా

యేసు నామమే మధురం

యేసయ్య సన్నిధినే మరువజాలను (2)

జీవితకాలమంతా ఆనందించెదా

యేసయ్యనే ఆరాధించెదా (2)          ||జుంటి తేనె||

 

యేసయ్య నామమే బహు పూజనీయము

నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)

నన్నెంతగానో దీవించి

జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2)      ||జుంటి తేనె||

 

యేసయ్య నామమే బలమైన దుర్గము

నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)

నన్నెంతగానో కరుణించి

పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)         ||జుంటి తేనె||

 

యేసయ్య నామమే పరిమళ తైలము

నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)

నన్నెంతగానో ప్రేమించి

 

విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2)         ||జుంటి తేనె||