జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా

 

నా జీవితకాలమంత నిను కీర్తించిన చాలునా 

నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా 

యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును 

నా దేహమే యాగముగా అర్పించిన చాలునా       ||నా జీవిత|| 

 

నా బాల్యమంతా నా తోడుగ నిలిచి 

ప్రతి కీడు నుండి తప్పించినావు 

యవ్వనకాలమున నే త్రోవ తొలగిన 

మన్నించి నాతోనే కొనసాగినావు 

ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో 

నను దైర్యపరిచి నను ఆదుకున్నావు 

యేసు నీవే నీవే యేసు… నీవే నా సర్వస్వమూ      ||నా జీవిత|| 

 

కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే 

సంతోష ఉదయాలు నాకిచ్చినావు 

హృదయాశలన్ని నెరవేర్చినావు 

యోగ్యుడను కాకున్న హెచ్చించినావు 

ఎంతో ప్రేమ మితిలేని కృపను 

నాపై చూపించి నను హత్తుకున్నావు 

యేసు నీవే నీవే యేసు… నీవే నా ఆనందమూ      ||నా జీవిత||