జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది

జీవితంలో నీలా ఉండాలని

యేసు నాలో ఎంతో ఆశున్నది (2)

తీరునా నా కోరిక

చేరితి ప్రభు పాదాల చెంత (2)      ||జీవితంలో||

 

కూర్చుండుటలో నిలుచుండుటలో

మాట్లాడుటలో ప్రేమించుటలో (2)

నీలాగే నడవాలని

నీ చిత్తం నెరవేర్చని

నీలాగే నడవాలని.. యేసయ్యా

నీ చిత్తం నెరవేర్చని

నీలాగే నడిచి

నీ చిత్తం నెరవేర్చి

నీ దరికి చేరాలని (2)        ||తీరునా||

 

పరిశుద్ధతలో ప్రార్ధించుటలో

ఊపవాసములొ ఉపదేశములో (2)

నీలాగే బ్రతకాలని

నీ చిత్తం నెరవేర్చని

నీలాగే బ్రతకాలని.. యేసయ్యా

నీ చిత్తం నెరవేర్చని

నీలాగే బ్రతికి

నీ చిత్తం నెరవేర్చి

 

నీ దరికి చేరాలని (2)        ||తీరునా||