జీవముగల దేవా జీవించుచున్నవాడా

జీవముగల దేవా జీవించుచున్నవాడా

జీవనరాగం జీవితగమ్యం జీవనజ్యోతివయా

యేసయ్యా – పావనమూర్తివయా

1. నను రక్షించిన నిన్ను మరువను

నా శిక్షబాపిన నిన్ను విడువను

నిన్న నేడు మారని దేవా – కన్నుల నిన్నే నిలుపు కొంటిని

2. నను మార్చిన నిను ఘనపరచెదను

ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను

 

సత్యము నీవే శాంతి ప్రదాతా – నిత్యము నా హృది నీదు నివాసం