జీవన తొలిసంద్య నీతోనే ఆరంభం

జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం

నా జీవన మలి సంధ్య నీతోనే అంతము (2)

నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమౌతుంది (2)

నను సిద్ధపరచు యేసు నాథా నీతోనుండుటకు (2)         ||జీవన||

 

నా జీవన యాత్రలో ఎన్నో అవరోధాలు

నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు (2)

నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను

నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను (2)

దేవా నీవే నా ఆశ్రయ దుర్గము (2)         ||జీవన||

 

నా పూర్వికులందరు ఎప్పుడో గతించారు

ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను (2)

నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా

నా వేష భాషయులన్నియు నీకే సమర్పింతును దేవా (2)

 

దేవా నను నీ సాక్షిగ నిల్పుమా (2)         ||జీవన||