జయహే జయహే – క్రీస్తేసు ప్రభువుకే జయహే

జయహే జయహే – క్రీస్తేసు ప్రభువుకే జయహే

జయహే జయహే – రారాజు ప్రభువుకే జయహే

నరులను చేసిన దేవునికి – జయహే జయహే

మరణము గెలిచిన వీరునికి – జయహే జయహే

త్రిత్వ దేవునికి జయహే – తండ్రి దేవునికి – జయహే

    ఆత్మనాదునికి –  జయహే – మన అన్న యేసునకు -జయహే – జయహే

1. తన మాటతో ఈ సృష్టిని – చేసిన దేవునికి జయహే

    తన రూపుతో  మానవులను – సృజించిన ప్రభువునకు జయహే

    ఆది అంతముకు – జయహే – అద్వితీయునకు – జయహే

    అత్యున్నతునకు – జయహే – అనాది దేవునికి జయహే

2. దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు – జయహే

    పరిశుద్దుడు పరిశుద్దుడని దూతలు పొగడే  ప్రభువుకు జయహే

    అగ్ని నేత్రునకు -జయహే – ఆత్మ రూపునకు – జయహే

    అమరత్వునకు – జయహే అనంతదేవునకు – జయహే

౩. తన రక్తమున్ మానవులకై  కార్చిన  యేసునకు -జయహే

     తన బలముతో మరణంబును జయించిన వీరునకు – జయహే

     సిల్వదారునకు -జయహే – త్యాగసీలునకు -జయహే

     మరణ విజయునకు -జయహే – జీవించు దేవునకు -జయహే

4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు – జయహే

    తనుండేడి  స్థలమందున మనలను ఉంచెడిప్రభువుకు – జయహే

    న్యాయ తీర్పరికి – జయహే – సర్వశక్తునకు – జయహే

 

    సర్వోన్నతునకు జయహే –  సైన్యముల అధిపతికి జయహే