జయశీలుడావగు ఓ మా ప్రభువా-జయగీతముల్ పాడేదం

జయశీలుడావగు ఓ మా ప్రభువా-జయగీతముల్ పాడేదం

 

1.పాపంబు చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి

కృతజ్ఞతచే హృదయము నిండె స్థితియింతుమో మా ప్రభు

 

2.నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీయందు స్థిరమాయెను

ఉదయించె మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము

 

3.అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి బాగ్యంబును

నీ జ్ఞానఘనత ఐశ్వర్యములను దాయతోడ నొసగితివి

 

4.శత్రుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి

భయభీతులోన అభయంబు నిచ్చి విడిపించితివి మా ప్రభో

 

5.యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి నేనిచ్చు రక్షణను

అని ప్రభూ నీవు పొరాడితివి మా పక్షమందు నీవే

 

6.క్రీస్తేసు ప్రభులో ప్రతిస్థలమందు విజయోత్సాహముతో మమ్ము    

ఊరేగించిచు మహిమ నొందుచున్న దేవా స్తోత్రములు

 

7.పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యత కనపరచుకొంటివి నీవు

 

విడువబడిన మమ్ము వివాహిత గా జేసే హల్లెలూయా పాడేదము