జయజయ గానము చేయుమా జయ శీలుని కొనియాడుమా

జయజయ గానము చేయుమా జయ శీలుని కొనియాడుమా

జయమును పొందెను మరణముపై

విజయుండయెను అపవాదిపై

 

1. మరణపు ముల్లును విరిచెను – మృత్యువును గెల్చి లేచెను

తనను నమ్మిన పిల్లలను – రాకడలో తిరిగి లేపును

 

2. సిద్దము చేయను నివాసము – వెళ్ళెను యేసు పరలోకము

 

కొనిపోవను తన భక్తులను – తిరిగొచ్చును మధ్యాకాశము