జన్మించెను ఒక తార

జన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ (2)

హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)            ||జన్మించెను||

ఇదిగో ప్రజలందరికి
సంతోషకరమైన సువార్తమానము (2)
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను (2)         ||హ్యాప్పీ||

సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ ఘనత ప్రభావము (2)
ఆయనకిష్టులకు
సమాధానము (2)               ||హ్యాప్పీ||

 

మనలను పాపాలనుండి
రక్షించు దేవుడు ఆయనే యేసు (2)
నీ కొరకే అరుదించే
తన ప్రాణం నిచ్చుటకై (2)       ||హ్యాప్పీ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *