జగతికి పునాది వేయకమునుపే – నన్ను ఎన్నుకున్న యేసయ్యా

జగతికి పునాది వేయకమునుపే – నన్ను ఎన్నుకున్న యేసయ్యా

నన్ను సృష్టించక ముందే – నన్ను ప్రేమించిన యేసయ్య(2)

యేసయ్యా…  యేసయ్యా…

జీవించలేను యేసయ్యా – నిన్ను వీడి నేను యేసయ్యా

పరుగు పరుగున వచ్చి హత్తుకుందును”జగతికి”

 

1.కరుణ సంపన్నుడై – కృపతో నన్ను రక్షించినావు

నీ దయా సంకల్పమే – నన్ను సొత్తుగా స్వీకరించింది(2)

నీ చిత్తమును గూర్చిన మర్మము తెలియజేశావు(2)

జీవించలేను యేసయ్యా – నిన్ను వీడి నేను యేసయ్యా

కోట్ల కోట్ల స్థుతులతో ఆరాధింతును(2)

 

2.నీ కృప మహావాత్సల్యముతో – నీ రక్తముతో విమోచించినావు

నీ పరిశుద్ధతతో నాకు – స్తుతి వస్త్రమును ఇచ్చావు(2)

సిద్ధపరచిన నీ సత్క్రియలతో నడిపించుచున్నావు

యేసయ్యా… యేసయ్యా…

జీవించలేను యేసయ్యా – నిన్ను వీడి నేను యేసయ్యా

అనుక్షణము మహిమపరతును

 

నిన్నే అనుక్షణము మహిమపరతును(2)”జగతికి”