చేయి పట్టుకో నా చేయి పట్టుకో

చేయి పట్టుకో నా చేయి పట్టుకో

జారిపోకుండా నే పడిపోకుండా

యేసు నా చేయి పట్టుకో (2)        ||చేయి||

 

కృంగిన వేళ ఓదార్పు నీవేగా

నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)

మరువగలనా నీ మధుర ప్రేమను

యేసు నా జీవితాంతము (2)

యేసు నా జీవితాంతము              ||చేయి||

 

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా

విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)

విడువగలనా ఒక నిమిషమైననూ

యేసు నా జీవితాంతము (2)

 

యేసు నా జీవితాంతము              ||చేయి||