చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం

చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం

అపవాది శక్తులతో అనుదినము పోరాటం !!2!!

ఏనాడో గెలిచాడు యేసు దేవుడు శత్రువుని మన పక్షాన్నా..

అపవాది తలత్రొక్కి లేచినాడుగ మనకివ్వ విజయాన్నీ…యే.యే .యే.యే.. యేసురక్తమే జయం జయం

అపవాది క్రియలకు అనంత నాశనము  !!2!!

1.మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు-ఆకాశదురాత్మలతో శక్తులతోనే పోరు    !!2!!

ప్రధానుల్ అధికారులేవరైనా అంధకార సంబంధ నాధులైనా

యేసయ్య నామంలో వంగాలి యేసయ్య నామంలో ఓడాలి 

యేసయ్య నామంలో వంగాలి.. ఓడాలి ప్రభుకే మ్రొక్కాలి

యేసురక్తమే జయం జయాం అపవాది క్రియలకు అనంత నాశనము  !!2!!

2.అపవాది తంత్రాలు మేమేరుగని వాళ్ళం కాదు-మానోటి సాక్యంతో ప్రభురక్తముతోగెలిచెదము-2

సర్వాంగ కవచాన్ని ధరియించి విశ్వాస ఢాలును ముందుంచి

అపవాది అగ్ని బాణాలార్పేస్తాం శ్రమశోధన దూషణలన్నిటి జయిస్తాం

అపవాది అగ్నిబాణార్పేస్తాం గెలిచేస్తాం ప్రభునే స్తుతిస్తాం

యేసురక్తమే జయం జయం

అపవాది క్రియలకు అనంత నాశనము  !!2!!

3 హృదయానికి ప్రభువిచ్చాడు

నీతి అనే కవచం- ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచి స్థిరపడతాం   !!2!!

దేవుని నీతినే మగునట్లు మానీతి ప్రభువే అయ్యాడు

సింహంలా ధైర్యముగా మేముంటాము ఏడుమారులు పడిన తిరిగి లేస్తాము

సింహంలా ధైర్యంగా మేముంటాము లేస్తాము ప్రభునే చూస్తాము

 

యేసురక్తమే జయం జయాం అపవాది క్రియలకు అనంత నాశనము  !!2!!