చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట

చెరలోనైనా పాడుతా ఆనందపు స్తుతి పాట

మరణము వరకు చాటుతా యేసయ్యను ప్రతి చోట  “2”

కరువైనా… బరువైనా…”2″..విడిచిపోను ప్రభు బాట…”2″   “చేరలోనైనా”

 

1. కష్టాల చీకటిలో దారి కనరాక పోయినా

   నష్టాల వేదనలో ఆశ మరి లేకపోయినా “2″

   నా భాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా “2″

నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెదుకుతుంటా “2″   “చేరలోనైనా”

 

2. అపాయములు బరువై సొమ్మసిల్లి పడిపోయినా

    సహాయకులు కరువై దేహమంత చెడిపోయినా “2″

    నా భాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా “2″…

నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెదుకుతుంటా “2″   “చెరలోనైనా”

 

3. అవాంతరాలేదురై నా నావ నిలిచిపోయినా

    ప్రశాంతతే కరువై నా గుండె చెదిరిపోయిన  “2”

    నా భాధలన్నిటిలో నిరీక్షణతో ఉంటా  “2”

 

నా తండ్రి చిత్తానికై శ్రమలోనే వెదుకుతుంటా  “2”  “చెరలోనైనా”