చెప్పండన్నా -జై జై యని

చెప్పండన్నా -జై జై యని-2

ప్రభు యేసునకు జై జై యని

1పాపులను ప్రేమించి పరలోకమిడెనన్నా

పాపుల రక్షణకై తన ప్రాణమిచ్చెనన్న

2 సిలువలో బలియాయే దేవుని గొఱ్ఱెపిల్ల

చిందించే తన రక్తం పాప విమోచనకై

3 రాజులకు రాజై ప్రభువులకు ప్రభువై

రారాజు రాజ్యమేల రయముగా వచ్చుచున్నాడు

4 ఇదియే రక్షణ వార్త నమ్మి రక్షణ పొందుము

 

నమ్మక పోయినచో నరకము తప్పదుగా