చెంగు చెంగుమంటూ భే..భే, చిన్నగొర్రెపిల్ల భే…భే కాపరి చుట్టు తిరుగుచుండెను

1.చెంగు చెంగుమంటూ భే..భే, చిన్నగొర్రెపిల్ల  భే…భే కాపరి చుట్టు తిరుగుచుండెను-2

చికిభం..చికి..చికిభం..భం..భం..భం..భం-2

1.పచ్చని పొలమొకటి కనులకు కనిపించే

ఆకలి తీరునని ఆశతో…అచటికేగెను-2

కాపరివెదక వచ్చి కనుగొని ఎత్తుకొనేను-2

చిన్నగొర్రెపిల్ల నేనే,ఆ కాపరి నా యేసే చికి

2.యో..యో..యోనా పారిపోవద్దు కన్నా

యో..యో..యోనా వెనుదిరగావా బుజ్జి కన్నా-2

యెహోవా సన్నిది నుండి పారిపోవద్దు పారిపోవద్దు

దేవునిచిత్తం మరచి పారిపోవద్దు పారిపోవద్దు-2

1.నశించిపోతుంది నినివే నా మాట వినిచేప్పు నీవే

నో..నో..నో..నో.. అన్నాడు తర్షీషుకు తప్పించుకెళ్ళాడు-2

2.చేపకడుపులో పడగానే ప్రార్ధన ప్రారంభమాయే-2

సారి..సారి..సారి..సారి.. అన్నాడు నినివే ఒడ్డున పడ్డాడు-2

3.నక్కినక్కి వచ్చినాడు జెక్కయ్య,జెక్కయ్య పొట్టి జెక్కయ్యj

మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జెక్కయ్య,జెక్కయ్య పొట్టి జెక్కయ్య

అలసిపోయి కొమ్మమీద వాలినాడు-ఏసుకొరకు ఎదురుచూచినాడు-2

1.కన్నులెత్తి చూచినాడుయేసయ్య,కిందకు దిగిరమ్మన్నాడు యేసయ్య-2

పరుగున దిగివచ్చినాడు జెక్కయ్య-2,యేసయ్యను చేర్చుకొనే జెక్కయ్య-2

4.బలములేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్,బుద్ధి గలిగి నడచుకోనెను వావ్ వావ్ వావ్

నాయకుడెవరు లేకున్నను లెఫ్ట్ రైట్ లెఫ్ట్,జ్ఞానములో జీవించెను వావ్ వావ్ వావ్

క్యూ కట్టి పనికి నడుం కట్టి ఆహరం నెత్తిన పెట్టి కూడబెట్టెను-2

వేసవికాలం కోతకాలం కూర్చుకొనెను,శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను

చకమ్ చకమ్ చకమ్-4

గుర్రుపెట్టి నిదురపోయే సోమరి మేలుకో,చీమల యోద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో-2

5.చిట్టి పొట్టి కధలు చెప్పి మనసునేంతో హాయిగొల్పే-2

చిల్డ్రన్ బైబిల్ క్లబ్ వచ్చెను వేసవి సెలవలు హాయిగా గడిచెను

 

ర పపపప……ర పపపపప…. –2